రష్యా సైన్యానికి ఇంధన సరఫరా అయ్యే కీలకమైన పైపులైన్‌ను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ వర్గాలు శనివారం ప్రకటించాయి. ఓ వైపు ఉక్రెయిన్ ఇంధన మౌలిక వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తూ రష్యా డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. దీనిని గుర్తించి ఉక్రెయిన్ సేనలు ఈ పైపులైన్‌ను లక్షంగా ఎంచుకుని పేల్చివేసినట్లు వెల్లడైంది. రష్యా సైనిక వ్యవస్థకు ఇది భారీ దెబ్బ అయిందని , ఇప్పుడిప్పుడే కోలుకోవడం కష్టం అవుతుందని ఉక్రెయిన్ అధికార వర్గాలు శనివారం దృవీకరించాయి. ఈ ప్రాంతంలో ఇది అత్యంత భారీ పైప్‌లైన్. వార్షికంగా ఈ పైపులైన్ ద్వారా సైన్యానికి అవసరం అయిన 3 మిలియన్ టన్నుల జెట్ ఫ్యూయల్, 2.8 మిలియన్ టన్నుల డీజిల్, గాసోలిన్ లక్షల టన్నులలో సరఫరా అవుతుంది.