మెట్రో రైలు ప్రయాణ వేళలు మారాయి. ఈ నెల 3 నుంచి మెట్రో రైలు ప్రయాణ వెళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు అన్ని టెర్మినెల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11.45 గం.ల వరకు, శనివారం ఉదయం 6 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు, ఆదివారం ఉదయం 7 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు మెట్రో ప్రయాణ వేళలు ఉన్నాయి. ప్రయాణీకులు ఈ కొత్త సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. మారిన వేళల ప్రకారం అర్థరాత్రి వరకు పనిచేసి మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.