ప్రఖ్యాత మహీంద్రా గ్రూప్ నుంచి త్వరలోనే ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యువి ఎక్స్‌ఇవి 9 ఎస్ వాహనం మార్కెట్‌లోకి రానుంది. ఈ విషయాన్ని సంస్థ అధికార వర్గాలు శనివారం తెలిపాయి. దేశంలో పలు రకాల అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంలో మహీంద్రా ముందుంది. ఈ దిశలోనే ఇప్పుడు సంస్థకు చెందిన ఐఎన్‌జిఎల్‌ఒ నుంచి ఈ వాహనం వెలువడనుంది. ఈ కొత్త వాహన సంబంధించి బెంగళూరులో ఈ నెల 27ప జరిగే స్క్రీమ్ ఎలక్ట్రిక్ కార్యక్రమంలో ఈ వాహన వరల్డ్ ప్రీమియర్ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆరోజునే మహీంద్రా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏడాది పూర్తి అవుతుంది. అధునాతన సాంకేతికత, సౌలభ్యం, బహుళార్థక సాదకం దిశలో పర్యావరణ హితంగా వాహనాల తయారీకి మహీంద్రా సంస్థ ప్రత్యేకించి ఒక విభాగం ఏర్పాటు చేసుకుంది. తమ ఈ విభాగం నుంచి తమ ఎలక్ట్రిక్ జర్నీ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఇప్పుడు తీసుకువచ్చే కొత్త వాహనం శక్తి, ధృఢత, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ పనితీరు సమ్మిశ్రితంగా నిలుస్తుందని వివరించారు. తమ ఎలక్ట్రిక్ పరిణామ క్రమంలో ఇప్పటి వాహనం కొత్త అధ్యాయం అవుతుందని తెలిపారు.