అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా జగ్గంపేటలో దారుణం చోటుచేసుకుంది. సెల్‌లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్న యువకుడిపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుండేపల్లి మండలం ఎర్రంపాలెంలో గత రాత్రి ఒక ఇంటి వద్ద స్నేహితుడు చందూతో కలిసి బుంగ బాబ్జీ సెల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆపి ఇంటికి వెళ్ళిపోవాలని కాకడ చిన్ని అనే స్ధానికుడు హెచ్చరించాడు. మాట వినకపోవడంతో ఆగ్రహంతో ఇంటికి వెళ్ళి కత్తి తెచ్చి బాబ్జీ మెడపై చిన్ని నరికాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాబ్జీ మృతి చెందాడు. గుండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.