ముంబై: ప్రతిష్టాత్మక ఆసియకప్‌లో భారత్ అద్వితయ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ట్రోఫీ మాత్రం ఇఫ్పటివరకూ అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పాకిస్థాన్‌కు చెందిన మోసిన్ నఖ్వీ ఉండటంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ అందుకోలేదు. నఖ్వీ కూడా ట్రోఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ట్రోఫీ గురించి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ నఖ్వీ మాత్రం ట్రోఫీ విషయంలో పట్టువీడటం లేదు. భారత క్రికెట్ బోర్డు కూడా ఏమాత్రం ఉపేక్షించడం లేదు. తాజా ఈ విషయంపై బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఘాటుగా స్పందించారు. ట్రోఫీ కచ్చితంగా భారత్‌కు వచ్చి తీరుతుందని.. కానీ నఖ్వీ చేతుల మీదుగా మాత్రం ట్రోఫీని అందుకొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
‘‘ఆసియా కప్ తప్పుకుండా భారత్‌కు చేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు ఎసిసి దృష్టికి తీసుకెళ్లాం. కానీ, సరైన స్పందన మాత్రం లేదు. దుబాయ్‌లో నవంబర్ 4వ తేదీన ఐసిసి సర్వసఖ్య సమవేశం మొదలవుతుంది. అంతకు ముందే ట్రోఫీ అందుతుందని భావిస్తున్నా. ఎందుకంటే టీం ఇండియానే విజేత కాబట్టి. ఎప్పుడు అనేది చెప్పలేము. కానీ, మోసిన్ చేతుల మీదులుగా మాత్రం ట్రోఫీ అందుకొనేది లేదు. మా స్టాండ్‌పై చాలా క్లియర్ ఉణ్నాం. మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్ మంత్రిగా ఉన్న ఎసిసి ఛైర్మన్ ట్రోఫీని బహుకరిస్తామంటే మేం అప్పుడు అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరించము’’ అని సైకియా స్పష్టం చేశారు.