ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు యువ హీరో రోషన్. నిర్మల కాన్వెంట్, పెళ్లి సందD సినిమాలతో ఇప్పటివరకూ మంచి సక్సెస్‌ని అందుకున్నాడు రోషన్. ప్రస్తుతం అతను నటిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అశ్వనిదత్ ఈ సినిమాను సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రోషన్ ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనుడు. పైగా ఇది బ్రిటిష్ కాలంలో జరిగే కథ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.