అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సితమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘోరం జరిగింది. ల్యాబ్ పరీక్షకు అనుమతించకపోవడంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డింది. ఎన్ నందినిరెడ్డి అనే యువతి బీటెక్ లో ఇసిఇ చదువుతోంది. ల్యాబ్ పరీక్షకు అనుమతించక పోవడంతో మానస్థపంతో అకాడమిక్ బ్లాక్ మూడవ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని రెడ్డి స్వగ్రామం సామిరెడ్డి పల్లి, జీడి నెల్లూరు మండలంగా గుర్తించారు. వెంటనే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.