మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభు త్వం నియమించింది. ఈయన దీంతోపాటు సం క్షేమశాఖ ప్రత్యేక సిఎస్‌గా కొనసాగనున్నారు. ర వాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించడంతో పాటు పశుసంవర్ధకశాఖ కార్యదర్శి గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించా రు. గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అ నితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. జీఏడి పొలిటికల్ ఇన్‌చార్జీగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండి గా యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డిని నియమించడంతో పాటు ఎస్సీ సహకార సంస్థ ఎండి గా అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇన్‌చార్జీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం సిఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలను ఉంచుకున్నారు.
త్వరలోనే పలువురు అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి
త్వరలో తెలంగాణకు చెందిన పలువురు (ఐఏఎస్, కన్‌ఫర్డ్‌లుగా) అయ్యే అవకాశం ఉందని, సుమారుగా 24 మంది ఐఏఎస్‌లు అయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తరువాత మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే పూర్తిస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.
ఇలంబర్తి పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం
పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి, ఐఏఎస్ (హెచ్‌ఎండిఏ పరిధిలో) పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. గత సంవత్సరం ఆయన జిహెచ్‌ఎంసిలోనూ 8 నెలలు మాత్రమే కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో కూడా ఆయన పనితీరులో మార్పు రాలేదని ఫైళ్లను పెండింగ్ పెడతారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి (హెచ్‌ఎండిఏ పరిధి)లో నియమించినా ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడం తప్ప ఆయనలో మార్పు రాలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఆయన పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినా ఆయన పెడచెవిన పెట్టారని అందుకే ఆయనకు రవాణా శాఖ కమిషనర్‌గా నియమించారని తెలుస్తోంది. గతంలోనూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దానకిశోర్ సైతం విధి నిర్వహణలో నిర్లక్షం వహించడంతో ఆయన్ను కార్మికశాఖకు ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.