ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది భారత్. ఈ విషయంలో భారత యువ సంచలనం జెమీమా రోడ్రిక్స్ కీలక పాత్ర పోషించింది. తన బ్యాటింగ్‌తో చివరి వరకూ పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జెమీ.. కెప్టెన్ ఔట్ అయినప్పటికీ.. పట్టువదలకుండా బ్యాటింగ్ చేసి శతకం సాధించింది.
అయితే మ్యాచ్‌లో ఒక దశలో తాను ఎదురుకున్న పరిస్థితి గురించి జెమీమా వివరించింది. ‘‘నేను 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు.. అప్పటికే చాలా అలసిపోయా. దీంతో దీప్తి శర్మకి ఒకటే చెప్పా ‘ప్లీజ్ దీపు నాతో మాట్లాడుతూనే ఉండు లేకపోతే నేను స్కోర్ చేయలేను’ అని అడిగాను. దీంతో దీప్తి ప్రతి బంతికి వచ్చి నాతో మాట్లాడింది. నన్ను ఉత్సాహపరిచింది. నా పరుగు కోసం తన వికెట్ కూడా త్యాగం చేసింది. పెవివలియన్‌కి వెళ్తూ కూడా ‘ఏం కంగారు వద్దు, నువ్వు మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి’ అని చెప్పింది. ఇలాంటి పార్టనర్‌షిప్‌లు లేకపోతే.. భారీ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. దీప్తి, రిచా, అమన్, ఆఖర్లో ఆడిన ఇన్నింగ్స్ చాలా కీలకం. హర్మన్‌తో కలిసి గొప్ప భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. గతంలో వికెట్ల పడిపోయే కొద్దీ మ్యాచ్‌ను చేజార్చుకొనే వాళ్లం. ఇప్పుడు టీం ఇండియా మారిపోయిందని నిరూపించాం’’ అని జెమీమా తెలిపింది.