ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి-20 సిరీస్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓటమి విషయం పక్కన పెడితే.. భారత్ తుది జట్టు ఎంపిక విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కి పరిమితం చేయడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు.
‘‘ఆర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. కనీసం మూడో టి-20లోకైనా జట్టులోకి తీసుకోవాలి. ఎక్కువగా బ్యాటర్లతోనే వెవెళ్లినా మ్యాచ్‌లు గెలవడం కష్టమే. భారత్ కూడా అదనంగా బ్యాటర్‌ను తీసుకొని ప్రయోగాలు చేస్తోంది. ప్రపంచకప్ కోసమే ఇదంతా అయినా.. బౌలింగ్ విభాగం కూడా కీలకమే. మెగా టోర్నీలో గెలవాలంటే.. కేవలం బ్యాటింగ్‌తోనే సాధ్యం కాదు. జట్టులో సరైన కూర్పు ఉండాలి. రెండో టి-20లో స్కోర్ బోర్డుపై ఎక్కువ పరుగులు లేకపోవడం కూడా భారత బౌలర్లు తేలిపోవడానికి కారణం. ఇంకాస్త అదనంగా ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని ఫించ్ తెలిపాడు.