మన తెలంగాణ/మోత్కూర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , మాజీ ఎంపి, (మాజీ క్రికెటర్) మహ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పట్ల మోత్కూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ సమీర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ… గత దశాబ్దన్నార కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ లో చురుకుగా పనిచేస్తున్న అజారుద్దీన్ సేవలను గుర్తించి మంత్రివర్గంలోకి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వర్గానికి , ఎమ్మెల్యేలకు సమీర్ కృతజ్ఞతలు తెలిపారు.