తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. 150వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే టిటిడి అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. ఈ సమయంలో టిటిడి భక్తులకు కీలక సూచనలు చేసింది. తిరుమల కాలిబాట మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత హల్‌చల్ చేసింది. కాలిబాట మార్గంలోని 150వ మెట్టు సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. చిరుతను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు. సమీపంలోని భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా భద్రతా సిబ్బంది పంపిస్తున్నారు.ఓ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మెగాఫోన్ పంపించి గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు.
మెగా ఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై టిటిడి అధికారులు స్పందించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది చిరుతను గుర్తించిన ప్రాంతానికి చేరుకున్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. చిన్నారులపై చిరుత దాడిచేసిన ఘటనలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో టిటిడి, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. సిసిటివి కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా చిరుత సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే భక్తులు మెట్ల మార్గంలో కొండకు చేరుకునే సమయంలో టిటిడి అధికారులు అటవీ సిబ్బంది చేసిన సూచనలు పాటించాలని కోరుతున్నారు.