హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ భారత జట్టు గెలిచి ఫైనల్‌కు చేరింది. సైమీస్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు భారత్ మహిళా జట్టు దూసుకెళ్లింది. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీచరణి, దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. జెమీమా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ కొనియాడారు. ఒకవేళ భారత్ మహిళ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిస్తే జెమీమాతో కలిసి పాట పాడుతానని తెలిపారు. ఆమెకు ఓల్డ్ మ్యాన్‌తో కలిసి గిటార్ ప్లే చేయడం ఇష్టమైతేను తాను పాటపాడుతానన్నారు. ఆమె గిటార్ వాయిస్తూ ఉంటే తాను గాయకుడిగా మారుతానన్నారు. 2024లో బిసిసిఐ అవార్డు కార్యక్రమంలో ఇద్దరు పాల్గొన్నామని, అక్కడి బ్యాండ్ ప్లే అవుతుంటే తాము జాయిన్ అయ్యామని, ఆమె గిటార్ ప్లే చేస్తుంటే తన వాయిస్‌తో పాట పాడానని సునీల్ గుర్తు చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.