పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఓజి నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది. యాక్షన్ సీన్ లో వచ్చే లెట్స్ గో జానీ సాంగ్ ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సాంగ్ ను థియేటర్స్ లో అభిమానుల బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియోను వదిలారు. ఓజి సినిమా కోసం ‘జానీ’, ‘తమ్ముడు’ మూవీలలోని సాంగ్స్‌ను రమణ గోగుల రీమిక్స్ చేసిన ఈ పాట మరోసారి అభిమానుల చేత కేరింతలు కొట్టించింది.
కాగా, ఓజి సినిమా పవన్ కల్యాణ్ కు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూల్ చేసింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగానూ ఓజి రికార్డు సాధించింది. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.