హైదరాబాద్: నిరంకుశత్వంపై ఉక్కు పాదం మోపిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏడాది పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉత్సవాలు జరుపుతామని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ రాజకీయ నేత కాదని, రైతాంగ ఉద్యమ నేత అని కిషన్ రెడ్డి కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ కు నచ్చదు అని దివంగత మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహ రావు అంటే కాంగ్రెస్ కు నచ్చదు అని చెప్పారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్ కు నచ్చుతుందని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను వెన్ను పోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ ది అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.