పాట్నా: బిహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నాయకుడు నితీష్ కుమార్ సమక్షంలో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఎ హామీ ఇచ్చింది.
ఎన్డీఎ మ్యానిఫెస్టోలోని హామీలు
- ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లను గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్లుగా మార్చడం
- ఈబీసీ ప్రజలకు రూ.10 లక్షలు అందించడంతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు
- కోటీశ్వరులైన మహిళా వ్యవస్థాపకులను తయారు చేయడం
- బీహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించడం
- పాట్నాతో పాటు నాలుగు నగరాల్లో మెట్రో సేవలను తీసుకురావడం
- బీహార్‌లో 10 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు
- 5 సంవత్సరాలలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం
- కేజీ నుండి పీజీ వరకు పిల్లలకు ఉచిత విద్యను అందించడం
- ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి
- ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు రూ.2000 ఒకేసారి సహాయం
- బీహార్‌లో ప్రపంచ స్థాయి వైద్యం, ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలను ఏర్పాటు
- మేడ్ ఇన్ బీహార్ పథకం ద్వారా వ్యవసాయ ఎగుమతులను రెట్టింపు చేయడం
- ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రతిజ్ఞ కింద 100 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు
- గిగ్ కార్మికులు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం