తిరుమల: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచరించింది. 150వ మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. చిరుతను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. వెంటనే భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. టిటిడి, ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు చిరుత పులులను అటవీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.