మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని మై నార్టీ, హైదరాబాద్ కోటా నుంచి అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించ డం, మంత్రిపదవులు ఆశించిన సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదా నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంతో ఇక కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టేనని ఆ పార్టీ వర్గాలు, రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో మూడు ఖా ళీ లు ఉండగా తాజాగా అజహరుద్దీన్‌ను తీసుకోవడంతో మరో రెండు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కూడా లైన్ క్లియర్ అయినట్టేనని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి . కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 వ తేది నాటికి రెండేళ్లు పూర్తికానుండటం తో
ఆలోగా మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా తాజాగా ధృవీకరించారు. మంత్రివర్గంలో నిన్నమొన్నటి వరకు మైనార్టీ సామాజికవర్గానికి, అలాగే కీలకమైన హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం లేకపోగా తాజాగా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ రెండు కోటాలకు ప్రాతినిధ్యం లభించినట్టు అయింది. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మాత్రమే మిగిలాయి. మంత్రివర్గంలో ముందు నుంచి ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇటీవల ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామికి, తాజాగా హైదరాబాద్ నుంచి అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించడంతో ఇక మిగిలింది తరువాయి 8లో