అమరావతి: ఏలూరు జిల్లాలో జంగారెడ్డి గూడెంలో దారుణం చోటుచేసుకుంది. భర్తతోనే కాదు బావ, మామతోనూ కాపురం చేయాలంటూ.. చిన్న కోడలిని అత్తమామలు చిత్ర హింసలు పెడుతున్నారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలను కనాలని వేధించారు. ఒప్పుకోక పోవడంతో చిన్న కోడలిని గదిలోనే బంధించి నరకయాతన పెడుతున్నారు. భర్త, బాధితురాలు మౌనంతో ఏం చేయాలో తెలియక దీనస్థితిలో ఉండిపోయారు. బాధితురాలు ఏడాది కిందటే బాబుకు జన్మనిచ్చింది. ఈ దారుణం స్థానికుల సహాయంతో పోలీసులకు దగ్గరకు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుకుని, అత్త మామలను అదుపులోకి తీసుకున్నారు.