న్యూఢిల్లీ: కెనడాలో గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 2022లో బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం (UBC) సమీపంలోని గోల్ఫ్ కోర్సులో గ్యాంగ్‌స్టర్ విశాల్ వాలియాను హత్యకు గరయ్యాడు. ఈ కేసులో భారత సంతతికి చెందిన బల్‌రాజ్ సింగ్ బాస్రాకు కెనడా కోర్టు జీవిత ఖైదు విధించింది. 25 సంవత్సరాలపాటు పెరోల్ పొందే అవకాశం లేకుండా తీర్పు వెల్లడించింది.
అక్టోబర్ 17, 2022న భారత సంతతికి చెందిన 38 ఏళ్ల విశాల్ వాలియా UBC సమీపంలోని యూనివర్సిటీ గోల్ఫ్ క్లబ్ పార్కింగ్ స్థలంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. విభేదాలు రావడంతో సహచరులే విశాల్ ను హత్య చేశారు. నిందితులు బాస్రా, ఇక్బాల్ కాంగ్, డియాండ్రే బాప్టిస్ట్ లు కాల్పులు జరిపి అక్కడి నుండి దొంగిలించిన ఆడి A4 సెడాన్‌లో పారిపోయారు. తర్వాత ఆధారాలు లేకుండా దానిని తగలబెట్టారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించిన కోర్టు జైలు శిక్ష విధించింది.