మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఓటర్లను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపో తే చారిత్రక తప్పిదం అవుతుందని ఆయన చెప్పా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో సిఎం మాట్లాడారు. కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చారనీ, కానీ ప్రజ లు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించార ని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. పీజేఆర్ అకాల మర ణం చెందితే ఆనాడు 2007లో వైరి పక్షాలు బీజే పీ, టీడీపీలు ఆయనపై ఉన్న గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ కుటుంబంపై టీఅరెస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపింది కేసీఆర్ కాదా?.. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా?.. అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నా రు. ఆనాడు పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టిన మీకు ఇవాళ సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదు. అని సిఎం విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ ను పెంచి పోషించిన వాళ్లు రౌడీలా.. పేదోళ్లకు అండగా ఉండే నవీన్ యాదవ్ రౌడీనా మీరే ఆలోచించండి అని రేవంత్‌రెడ్డి సూచించారు.
కెసిఆర్‌ను అడగదలుచుకున్నా..
బీఆరెస్ సెంటిమెంట్‌ను సొమ్ముచేసుకునే ప్రయత్నంలో కెసీఆర్‌ను ఓ మాట అడగదలచుకున్నా.. ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనా టి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మం త్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్‌కు వచ్చారా..? ఇక్క డి ప్రజల ముఖం చూశారా..? ఈ ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నారా? అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలనుద్దేశించి సిఎం అడిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో బీఆరెస్ అవయవదానంచేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యం మేం కల్పిస్తే.. ఆటోవాళ్లను రెచ్చగొట్టి ఫ్రీ బస్సు బంద్ చేయాలని బయలుదేరారం టూ సిఎం విమర్శించారు. బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతూ.. ఫోటోలు దిగుతున్నారు. బీఆరెస్ వాళ్లు వస్తే మా అక్కలు కర్రు కాల్చి వాత పె ట్టండి. అని రేవంత్‌రెడ్డి కోరారు. బిఆర్‌ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయ్.. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్. రేషన్ కార్డులు రద్దు చేస్తారు. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కిషన్‌రెడ్డి అడ్డుపడుతుండు..
బీఆరెస్‌తో కుమ్మక్కై కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుండు. బీజేపీ, బీఆరెస్‌ది ఫెవికా ల్ బంధం అని సిఎం విమర్శించారు. మా ప్రభు త్వం నగరాన్ని అభివృద్ధిని చేయాలనుకుంటుంటే, కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీ నది సుందరీకరణకు అడ్డుపడుతుండు.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్‌కు పేరొస్తుందనే.. అక్కసుతో అడ్డుపడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోది ఏం ఇచ్చారని బీజేపీ ఎంపీ లు ఇక్కడ తిరుగుతున్నారనీ రేవంత్‌రెడ్డి ప్రశ్నల వ ర్షం కురిపించారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రు లు ఉండి నగరానికి ఏమైనా నిధులు తెచ్చారా? అ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సిగ్గులేకుండా జూబ్లీహిల్స్‌లో కార్పెట్ బాంబింగ్ చేస్తామని చెబుతున్నారనీ ఆయన విమర్శించారు.
అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా..
జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నవీన్ యాదవ్‌ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడు. ఎమ్మెల్యే గా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. పదేళ్లు దోచుకున్న దోపిడీ దొం గలు ముసుగు వేసుకుని జూబ్లీహిల్స్ వస్తున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి ఎందుకంత కడుపుమంట అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.