హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారానికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. క్రికెటర్ గా ప్రత్యేక అజారుద్దీన్ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా అజారుద్దీన్ పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 1963 ఫిభ్రవరి 8న హైదరాబాద్ లో అజారుద్దీన్ జన్మించారు. అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో అజారుద్దీన్ పాఠశాల విద్యను అభ్యసించారు. మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తి తో క్రికెట్ వైపు అడుగులు వేశారు. 1984 లో అంతర్జాతీయ క్రికెట్ లో రంగ ప్రవేశం చేశారు. తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో అజారుద్దీన్ సంచలనం సృష్టించారు. పదహారేళ్ల క్రికెట్ కెరీర్ లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. 1989 లో టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. 2009 ఫిబ్రవరి 19 న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 యూపిలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపిగా గెలుపు పొందారు. 2018 టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ నియామకం చేశారు.