హైదరాబాద్: శుభ్‌మన్ గిల్ టెస్టులో అదరగొడుతున్నాడు. వన్డేలలో కూడా పర్వాలేదనిపిస్తాడు. వన్టే, టెస్టులకు గిల్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అదనపు బాధ్యతలు రావడంతో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. టి20లకు మాత్రం వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్‌లో తొలి టి20లో గిల్ బ్యాటింగ్‌లో అరదగొట్టాడు. అభిషేక్ ఔటైన తరువాత సూర్యతో కలిసి గిల్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ సందర్భంగా గిల్ బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొనియాడారు. కెప్టెన్, వైఎస్ కెప్టెన్ పదువుల రావడంతో గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడన్నారు. టి20ల్లో ఒత్తిడి లేకుండా ఆడడం అనే గొప్ప విషయమని ప్రశంసించారు. బాధ్యతలే అతడిలో ఉత్తమ ఆటను బయటకు తీసుకొస్తున్నాయని, ఆత్మవిశ్వాసం పెరగడంతో వన్డే, టెస్టుల్లో నిలకడ పరుగులు చేస్తున్నాడని, టి20ల్లో పరుగుల మాత్రం ఆపకూడదని దినేశ్ కార్తీక్ సలహా ఇచ్చాడు. వన్డేలలో కోహ్లీ క్రీజులో ఉంటే చాలు పరుగులు వాటంతట అవే వస్తాయని, గిల్ కూడా టి20ల్లో అదే రూల్ పాలో అవుతున్నారని మెచ్చుకున్నాడు. ఆసీస్ జరిగిన టి20లో స్కోరు బోర్డు చూసే వరకు ఎన్ని పరుగులు చేశాడో తెలియదన్నాడు. వన్డేలో కోహ్లీ ఆటను టి20ల్లో గిల్ చూపిస్తున్నాడన్నారు. భారత్ బ్యాటింగ్ డెప్త్ చాలా పెద్దదిగా ఉందని, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను దాటుకొని ఓపెనర్‌గా గిల్ వచ్చాడని, టి20ల్లో ఓపెనర్‌గా రావడం అనేది కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడం అని దినేశ్ కార్తీక్ ప్రశంసించారు. ఒత్తిడి అధిగమించి పరుగులు తీయడంతో పాటు ప్రతి మూడు మ్యాచ్‌లలో విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాలని దినేశ్ కార్తీక్ సూచనలు చేశాడు.