వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా… సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సంయుక్తగా నిర్మిస్తున్నారు. మేకర్స్ రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ రిలీజ్ చేశారు. ఝాను చాంతర్ స్వరపరిచిన ఈ సాంగ్ అదిరిపోయింది.