పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాని ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘సరిపోదా శనివారం’తో మంచి హిట్‌ను అందుకుంది. అయితే హీరో రామ్.. కిషోర్ గోపు అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్టు సమాచారం. ఇది లవ్ అండ్ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్. సినిమాలో హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్ర ఉంటుందంటున్నారు.