మావోయిస్టుల నిర్మూలనే లక్షంగా పోలీసు బలగాల వేట కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఆగ్రనాయకులు ఆయుధాలతో సహ లొంగిపోతున్నారు. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మావోయిస్టుల కుట్రను భగ్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గోటుంపల్లి అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసు భద్రత బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ స్మారక స్థూపాన్ని గుర్తించి కూల్చివేశారు.