మన తెలంగాణ/యాదగిరిగుట్ట: పోలీసు అమరవీరుల దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పిఎస్ పరిధిలోని య ఎసిపి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్ రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ భాస్కర్, వివిధ మండలాల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.