హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం చూపింది. వరి, పత్తి పంటలకు భారీగా నష్టం జరిగింది. పత్తి, వరి పత్తి, వరి పోలాలకు వరద నీరు చేరడంతో నల్గొండ జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయామని వరి, పత్తి రైతులు ఆవేదన చెందారు. నల్లొండ జిల్లాలో 5.64 లక్షల ఎకరాల్లో పత్తి రైతులు సాగు చేశారు. ఈ నెల 14 న పత్తి కొనుగోలు కేంద్రాలు అధికారులు ప్రారంభించారు. తేమ అధికంగా ఉందని పత్తిని అధికారులు కొనుగోలు చేయలేదని అన్నారు. తాజాగా కురిసిన వర్షాలకు పత్తి మరింతగా తడిసిందని రైతులు ఆవేదన చెందారు. తేమ శాతం నిబంధన సడలించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.