ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హకీంపేటకు చెందిన మహ్మద్ ముజామిల్ అలియాస్ ఆయూబ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయూబ్‌ను హత్య చేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టోలీచౌకి పోలీసులు తెలిపారు.