రానున్న ఐపిఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ప్రధాన కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను ఎంపిక చేశారు. కిందటి సీజన్‌లో ప్రధాన కోచ్‌గా పని చేసిన చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్‌ను తీసుకున్నారు. అభిషేక్ 2018 నుంచి కోల్‌కతా టీమ్‌లో సహాయక కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా అతన్ని ప్రధాన కోచ్‌గా నియమించాలని కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషాయన్ని ఫ్రాంచైజీ ప్రతినిధి వెంకీ మైసూర్ అధికారికంగా ప్రకటించారు. అతని పర్యవేక్షణలో కోల్‌కతా మెరుగైన ప్రదర్శన చేస్తుందనే నమ్మకం తమకుందన్నారు. అన్ని ఆలోచించే నాయర్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు.