హైదరాబాద్: దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారుడు.. ముహమ్మద్ అజారుద్దీన్ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ బిడ్డ.. మన కీర్తిపతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని దేశ రాశారని ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన వ్యక్తి అజారుద్దీన్ అని ప్రశంసించారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలని సూచించారు. బిఆర్ఎస్ ను గెలిపించడంలో భాగంగానే బిజెపి నేతలు లేఖలు రాశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ పార్టీ సహకరించిందని భట్టి మండిపడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి బలహీన వ్యక్తిని నిలబెట్టారని, అజారుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా గవర్నర్ పైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని, గవర్నర్ గొప్ప వ్యక్తి.. ఇలాంటి ఒత్తిళ్లకు లొంగరని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.