ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కార్గో బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.