మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో అద్భత విజయం సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) వీరోచిత శతకంతో చెలరేగింది. అలాగే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) కీలక ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరితోపాటు దీప్తి శర్మ(24), రిచా ఘోష్(26), అమన్ జ్యోత్ కౌర్(15 నాటౌట్)లు రాణించారు. దీంతో భారత్ ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్ లో సౌతాఫ్రికా జట్టుతో భారత్ తలపడనుంది.