హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు చెరుకూరి రంగయ్య(82) నాయుడు బుధవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో సిఆర్ నాయుడు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య జాన్సీలక్ష్మీ, కూతురు హిమబిందు ఉన్నారు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన అందరికీ సిఆర్ నాయుడుగా పరిచయలు పెంచుకున్నారు ఆయన యుఎన్ఐ, ఈనాడు, ఉదయం, వార్త తదితర ప్రధాన తెలుగు పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. తెలుగులో అన్ని ప్రధాన వార్తా పత్రికలకు చాలాకాలం తిరుపతి నుంచి ఎక్కువగా పని చేశారు. ఆ తర్వాత అనేక చిన్న, మధ్య తరహా పత్రికల్లో కూడా పని చేశారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.