శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక ప్రయాణికుని వద్ద లైవ్ బుల్లెట్‌ను ఎయిర్‌పోర్ట్ సిఐఎస్‌ఎఫ్ ఆధికారులు గుర్తించారు ఎయిర్‌పోర్ట్ సిఐఎస్‌ఎఫ్ ఆధికారులు. బుల్లెట్‌తోపాటు నిందితుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్ అనే ప్రయాణికుడు బుధవారం ఇండిగో విమానంలో కోల్‌కత్తా నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాడు. మళ్లీ బెంగుళూరు వెళ్లేందుకు మరో ఇండిగో విమానానికి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ బుకింగ్ చేసుకుని బోర్డింగ్ వద్దకు వెళ్ళాడు. దీంతో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అతని లగేజీ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అయితే అందులో 38 లైవ్‌బుల్లెట్‌ను గుర్తించారు. బుల్లెట్‌కు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు అతని వద్ద లేకపోవడం, విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో బుల్లెట్‌తోపాటు అతనిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు విశాల్ వద్ద లభించిన బుల్లెట్ ఎక్కడిది..? బ్యాగ్ లోకి ఎలా వచ్చింది..? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
కలకలం రేపిన అనుమానాస్పద బ్యాగు ..మొబైల్ ఫోన్‌లు, సిగరేట్‌లు లభ్యం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని అరైవల్ విలేజ్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని ప్రయాణికుడు బ్యాగును వదిలేసి వెళ్లాడు. అయితే చాలా సమయం వరకు బ్యాగు వద్దకు ఎవరూ రాకపోవడంతో విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి అప్రమత్తం అయ్యారు. బ్యాగ్ వద్ద ఉన్న ప్రయాణికులను పక్కకు పంపించి వేసి బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిచి తనిఖీలు చేపట్టారు. దీంతో బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే బ్యాగును ఓపెన్ చేసిన సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులకు అందులో సెల్‌ఫోన్‌లు సిగరెట్లు కనబడ్డాయి. దీంతో సెల్‌ఫోన్లు, సిగరెట్‌లు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు బ్యాగ్ ఎక్కడిది? ఎవరిది.? ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్లారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.