ఏ ఆటలో అయినా.. క్రీడాస్పూర్తి చాలా ముఖ్యం. మన ఆట మనం ఆడుతూనే.. ప్రత్యర్థి ఆటను కూడా గౌరవించాలి. ప్రత్యర్థులు ఏదైనా ఘనత సాధిస్తే.. దాన్ని అభినందించే మనస్సు ఉండాలి. అంతేకానీ, ఒకరని ఒకరు దూషించుకోవడం.. వాగ్వాదానికి, గొడవకు దిగడం వంటి పనులు చేయకూడదు. అయితే మొదట చెప్పిన అంశాలు దాదాపు అంరూ పాటిస్తారు.. ఎవరో కొందరు మాత్రం రెండోసారి చెప్పిన విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన ఓ పనికి సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం రంజీ ట్రోపీ జరుగుతున్న విషయం తెలిసిందే. రుతురాజ్, పృథ్వీ షాలు మహారాష్ట్ర తరఫున ఆడుతున్నారు. ఛండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ డబుల్ సెంచరీ (222) చేయగా.. రుతురాజ్ సెంచరీతో (116) చెలరేగడడంతో ఛంఢీగడ్‌పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రుతురాజ్‌కి ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన పృథ్వీ షాను పిలిచి అతడితో కలిసి పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రుతురాజ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.