ఒటిటిలో ఎక్కువ శాతం.. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిలర్ సినిమాలు, సిరీస్‌ల హవా నడుస్తోంది. కానీ, పొలిటికల్ డ్రామాలను ఇష్టంగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా పొలిటికల్ థ్రిలర్‌గా విడుదలైన ‘మహారాణి’ సిరీస్‌ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన మూడు సీజన్లలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నమ్మకంతోనే ఇఫ్పుడు నాలుగో సీజన్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి.. సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్‌సిరీస్ నాలుగో సీజన్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సీజన్ వచ్చే నెల 7వ తేదీన ప్రముఖ ఒటిటి సంస్థ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ సిరీస్ తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి.