కాన్‌బెర్రా: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. అయితే తొలి ఐదు ఓవర్లు ముగిసేలోపు భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. అబిషేక్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వాన తగ్గడంతో మ్యాచ్‌ని 18 ఓవర్లకు కుదించి తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో క్రీజ్‌లో ఉన్న భారత కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెచ్చిపోయారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. కానీ, వరుణ దేవుడు మరోసారి మ్యాచ్‌కి అడ్డుపడ్డాడు. ప్రస్తుతం 9.4 ఓవర్ల వద్ద భారత్ 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజ్‌లో సూర్య (39), గిల్ (37) ఉన్నారు.