హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బిఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. మళ్లీ మూడేళ్ల వరకూ ఆగాల్సిన అవసరం కూడా రాకపోవచ్చని పేర్కొన్నారు. ఎవరో పిలిచినట్లే నిన్న సిఎం రేవంత్ రెడ్డి యూసఫ్‌గూడకు వెళ్లారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్‌ను గెలిచించాలని ప్రజలను కోరారు. రేవంత్‌రెడ్డి వద్దే డబ్బులు లేకపోతే అభ్యర్థి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? అని ప్రశ్నించారు. ప్రజలను అంగడి సరుకులా కొని ఎన్నికలో గెలియచందుకు కాంగ్రెస్ యత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బిఆర్ఎస్‌కు వేయండి అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు దిగుతున్నారు అని మండిపడ్డారు. ఇప్పడే ఇలా ఉంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.