మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని, మూడేళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉం డదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ, ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని ఆయన కోరారు. కత్తి వాళ్లకు ఇ చ్చి యుద్ధం తమను చేయమంటే ఎలా అని కెటిఆర్ ప్రశ్నించారు. కత్తి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ తో యుద్ధం చేసే బాధ్యత తమదని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడు తూ భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా..? మా గంటి సునీతపై కామెంట్ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలంటూ కెటిఆర్ ఫైర్ అయ్యారు. వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ నే తలకు బాధ కలగదా అంటూ ఆయన నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయరని తెలిసి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నార ని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వారి ఓటు కూడా ఎవరో ఒక రు వేసేస్తారన్నారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కెసిఆర్‌దని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో కరెంటు కూడా సరిగా ఉండట్లేదని కెటిఆర్ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వా త ఫ్రీ వాటర్ స్కీం కూడా ఎత్తేస్తారని ఒక ఇంటర్వ్యూలో సిఎం రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారని కెటిఆర్ తెలిపారు. ఒక్క కొత్త రోడ్డు లేదని, కొత్త బ్రిడ్జి లేదని, కొత్త బిల్డింగ్ కట్టలేదని కెటిఆర్ విమర్శించారు. కానీ, కెసిఆర్ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ప్రారంభిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే బిసి బిల్లుకు బిఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందని చెప్పామని మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పొన్నాల లక్ష్మయ్య, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.