ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మంగళవారం రాత్రి 104 మంది చనిపోయినట్లు గాజాలోని అరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నా, ఇజ్రాయెల్ సైన్యం బుధవారం కాల్పుల విరమణను అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. హమాస్ ఒక ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు పేర్కొంది.ఇజ్రాయిలే ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మొదట పాలస్తీనా ఉగ్రవాదులు తమ సైనికుడిని చంపిన తర్వాతే, మంగళవారం రాత్రి తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించినందువల్లనే ప్రతిదాడులు చేశామని పేర్కొంది. తాము ఒప్పందాన్ని కొనసాగిస్తామని, ప్రత్యర్థినుంచి ఎలాంటి ఉల్లంఘన జరిగినా, దీటుగా స్పందించి తీరతామని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడుల్లో కనీసం 104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారిలో సెంట్రల్ గాజాలోని బురైజ్ శరణార్థి శిబిరంలోని ఐదుగురు , గాజానగరంలోని సబ్రా సమీపంలోని భవనంలోని నలుగురు, ఖాన్ యూనిస్ లోని ఒకకారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు.