అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో గ్యాస్ సిలిండర్ పేలింది. హరిజనవాడలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. బుధవారం రోజు ఉదయం టీ కాచేందుకు చిన్న పాపమ్మ అనే మహిళ గ్యాస్ వెలిగించింది. అప్పటికే రూమ్ లో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పేలిపోయింది. సదరు మహిళ చీరకు నిప్పంటుకోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో నాలుగు వైపుల గోడలు కూలిపోయాయి.