మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణ యం తీసుకుంది. ఇంతవరకు మంత్రివర్గంలో మైనార్టీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ స్థానంలో క్రికెట్ మాజీ కెప్టె న్ అజారుద్దీన్‌కు చోటు కల్పించాలని సీఎం నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో ఆజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజ్‌భవన్‌కు సమాచారం పంపించినట్టుఅధికార వర్గాల సమాచారం. కాగా ఉప ఎన్నిక జరుగునున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మై నారిటీ ఓటర్లు అధికంగా ఉండటం ఆ వర్గం
ఓ టర్లకు గాలం వేయడానికే అజారుద్దీన్‌కు మం త్రివర్గంలో స్థానం కల్పించాలన్న నిర్ణయానికి కారణమనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నా యి. ఈ అంశంపై పిసిసి అధ్యక్షుడు బి. మ హేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, మంత్రివర్గంలో మైనారిటీ స్థానం కల్పించాలన్న ఆలోచన ఎప్ప టి నుంచో ఉందని, ఇప్పుడు ఆ అవకాశం అజర్‌కు దక్కబోతుందన్నారు. ఇలా ఉండగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలిసింది.
ప్రతిష్టాకరంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తోన్నారు. ఇప్పటికే పదకొండు మంది మంత్రులను, ఒక ఎంపీని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్‌ఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని అధిష్ఠానానికి పంపించడానికి జూబ్లీహిల్స్ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకున్నట్టు సీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తుండగా,
మరోవైపు పార్టీలో సీఎం వ్యతిరేక వర్గీయులు కూడా అధిష్ఠానానికి తరుచు ఫిర్యాదు చేస్తోన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అటు ప్రతిపక్షానికి, ఇటు స్వపక్షంలో విపక్షానికి ఈ రెండింకి చెక్ పెట్టడానికి ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాకరంగా తీసుకొని ఏ విధంగా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.
అజర్‌నే ఎందుకు?
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కే మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటీ ఓటర్లు ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్త్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గతంలో 2014 మజ్లీస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో ఆయన్నే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో నవీన్ యాదవ్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు మైనార్టీ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మక ఎత్తుగడగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు మరింత మెరుగు అయినట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నిర్ణయం వల్ల మంత్రివర్గంలో జిహెచ్‌ఎంసి పరిథిలో ప్రాతినిధ్యం లేదన్న విమర్శకు కూడా చెక్ పెట్టినట్టు అయిందని చెప్పవచ్చు. రెండేళ్ళుగా మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరూ లేరు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో హైదరాబాద్ నుంచి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఉన్న సంగతి తెలిసిందే.
సిఎం రేవంత్‌రెడ్డితో అజారుద్దీన్ భేటీ
మైనారిటీ నేతల ధన్యవాదాలు
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అజర్‌ను శుక్రవారం మంత్రివర్గంలోకి తీసుకోనున్నందున ఆయన ముఖ్యమంత్రిని కలిసి తనకు కల్పిస్తున్న అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, ఇంకా పలు ముస్లిం సంస్థల నాయకులూ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర మంత్రివర్గంలోకి మైనారిటీ వర్గానికి అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.