రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన జరిగిన మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాల నూతనం నిర్మాణం కోసం విద్యాశాఖ రూ.10 కోట్లు మంజూరు చేసింది.