హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నగర శివారులో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ జాహ్నవి తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాజేంద్రనగర్ లో ఉంటున్న జమ్మూకు చెందిన జాహ్నవి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.