బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యధికంగా లక్షా 35 వేల రూపాయలకు పైగా చేరుకోగా.. కేజి వెండి ధర 2 లక్షల రూపాయలు దాటిపోయింది. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో పసిడి, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర గత వారం రోజుల్లోనే రూ.40 వేలు పడిపోయింది. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది.
ఈ క్రమంలో హైదరాబాద్ బులిటెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460కు పడిపోగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 తగ్గింది. కేజీ వెండి రూ.1,65,000కు చేరుకుంది. హైదరాబాద్ తోపాటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.