కెన్యా లోని కోస్తా ప్రాంతం క్వాలే కౌంటీలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పర్యాటకుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. విమానం డయాని నుండి మాసాయి మారాలో కిచ్వాటెంబోకు బయలుదేరగా, కొద్ది సేపటికే కూలిపోయింది. “ 5 వై రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ విమానం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను , దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాద స్థలానికి వెళ్లారు ” అని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటనలో పేర్కొంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియనప్పటికీ ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి.మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ప్రఖ్యాత టూరిస్టు ప్రదేశంగా ప్రాచుర్యం పొందింది.