యంగ్ టాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నే చురల్ లవ్ స్టొరీ ’కృష్ణ లీల’. ’తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాజీ సిబిఐ జే.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ అనిల్ చాలా అద్భుతంగా ఈ స్టోరీని రాశారు అని తెలియజేశారు. హీరో దేవన్ మాట్లాడుతూ “కృష్ణ లీల ఒక బ్యూ టిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమని కృష్ణ లీల లో చాలా వండర్‌ఫుల్‌గా థ్రిల్లింగ్ గా చూపించాం”అని అన్నారు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్క డా రాజీ పడకుండా సినిమా తీశారు”అని తెలిపారు. నిర్మాత జోష్నా మాట్లాడుతూ ‘దేవన్ అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది”అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిల్ కిరణ్ పాల్గొన్నారు.