హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్తున్న 1055 ఆర్టిసి బస్సు షాద్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి రాయచూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు షాద్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై వస్తున్న క్రమంలో ముందు టైరు బ్లాస్ట్ అయింది. డ్రైవర్ అప్రమత్తత కావడంతో పెను ప్రమాదం తప్పింది. టైర్ పగలడంతో పొగ అలుముకుంది. దీంతో ప్రయాణికులు సురక్షితంగా కిందికి దిగారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.