ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయి లో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలో సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల కోత ఉండొచ్చ ని సమాచారం. ఇది మొత్తం 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో దాదాపు 10%వాటాను కల్గి ఉంటుంది. 2022 ఈ చర్య హెచ్‌ఆర్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ), డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ విభాగాలపై కరోనా మహమ్మారి సమయంలో అధిక నియామకాలు జరిగాయని, దీంతో ఇప్పుడు వాటిని సమతుల్యం చేసే పనిలో ఉన్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అమెజాన్‌లో మొత్తం 15.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఉండే గ్రూప్ మేనేజర్ల కు తెలియజేయగా, మంగళవారం నుండి ఉద్యోగులకు ఇమెయి ల్ నోటీసులు పంపడం ప్రారంభించారు. కంపెనీ సిఇఒ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఎఐ సాధనాల వినియోగం పెరుగుతుండటంతో పునరావృత పనుల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు సంభవించే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో అమెజాన్ తక్కువ మంది కార్మికులతో గిడ్డంగులను నిర్మించాలనే ప్రణాళికలో ఉంది. 2027 నాటికి 75 శాతం కార్యకలాపాలను ఆటోమేట్ చేయాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. రోబోలు ప్రతి ఉత్పత్తిపై సుమారు రూ.2.5 వరకు ఆదా చేయగలవని అంచనా. దీంతో కంపెనీ 2025-2027 మధ్య రూ. 1 లక్ష కోట్లు వరకు ఆదా చేసేందుకు అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.